Accident | ద్విచక్ర వాహనాలు ఢీ.. ఇద్దరు మృతి..

Accident | ద్విచక్ర వాహనాలు ఢీ.. ఇద్దరు మృతి..

Accident | వెల్దుర్తి, ఆంధ్రప్రభ : రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని సిరిగిరిపాడు గ్రామ సమీపంలో గురువారం చోటు చేసుకుంది. ఈ ప్రమాద సంఘటన పై ఎస్ఐ సత్యనారాయణ ఇచ్చిన సమాచారం ప్రకారం.. కరీముల్లా వయసు 50. టీవీఎస్ 100 వాహనం పై మాచర్ల నుండి నూర్జహాన్ (45) అనే మహిళను కరిముల్లా ఎక్కించుకొని మార్కాపురం వైపు వెళుతున్నాడు. వెల్దుర్తి మండలం సిరిగిరిపాడు గ్రామ సమీపంలో మార్కాపురం వైపు నుండి మహేష్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనం నుండి సిరిగిరిపాడు వైపు వస్తుండగా రెండు వాహనాలు ఢీకొనడంతో కరీముల్లా అక్కడికక్కడే మృతి చెందగా వాహనం వెనకాల కూర్చున్న మహిళ నూర్జహాన్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రైవేట్ వాహనంలో క్షతగాత్రులను మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అయితే.. చికిత్స చేస్తుండగా ఆమె మృతి చెందినట్లు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. ఈ సంఘటన పై వెల్దుర్తి ఎస్ఐ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply