ACB Rides | ఏసీబీ తనిఖీలు

ACB Rides | ఏసీబీ తనిఖీలు
ACB Rides | ఖమ్మం, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా రవాణా శాఖ (RTA) కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు దాడులు నిర్వహించారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు (ACB Rides) చేశారు. ఈ దాడుల్లో ఒక ఉద్యోగిని అరెస్టు చేసిన ఏసీబీ సిబ్బంది, పలు కీలక దస్తావేజులతో పాటు వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు (RC), డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం ఏసీబీ డీఎస్పీ (Khammam ACB DSP) నేతృత్వంలో జరిగిన ఈ ఆపరేషన్లో రవాణాశాఖలో జరుగుతున్న అక్రమ వసూళ్లు, దళారుల ద్వారా లంచాలు తీసుకోవడం వంటి అంశాలు బయటపడ్డాయి.
కార్యాలయంలో అనధికారిక వ్యక్తులు పనిచేస్తూ, వాహన రిజిస్ట్రేషన్, లైసెన్స్ జారీ (Vehicle registration and license issuance) వంటి పనులకు మామూళ్లు వసూలు చేస్తున్నట్టు ఆధారాలు లభించాయి. అరెస్టైన వ్యక్తి వివరాలను ఏసీబీ అధికారులు త్వరలో వెల్లడించనున్నారు. స్వాధీనం చేసుకున్న దస్తావేజులు, RCలు, లైసెన్స్ కార్డుల ఆధారంగా మరిన్ని అక్రమాలు బయటపడే అవకాశం ఉంది. ఈ ఘటనతో ఖమ్మం జిల్లా రవాణా శాఖలో అవినీతిపై దృష్టి సారించిన ఏసీబీ అధికారులు తదుపరి చర్యలు తీసుకోనున్నారు.
