హనుమకొండ సబ్ రిజిస్టర్ కార్యాలయంపై ఏసీబీ దాడి..

కాజీపేట, ఆంధ్రప్రభ : కాజీపేట పట్టణం 100 ఫీట్ల రోడ్డు ఉన్న హనుమకొండ సబ్ రిజిస్టర్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడి చేయడంతో సంచలనం నెలకొంది. డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ రైటర్లు అంతా తాళాలు వేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. రిజిస్ట్రేషన్ కార్యాలయం మూసివేసి లోపల ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈ ఆకస్మిక దాడి జరిగినట్లు సమాచారం. ఏసీబీ బృందం కార్యాలయంలోని డాక్యుమెంట్లు, రికార్డులు, లెక్కలు సమగ్రంగా పరిశీలిస్తోంది. ఇంకా ఏయే అనుమానాస్పద అంశాలు వెలుగులోకి వస్తాయనేది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ప్రస్తుతం కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లు స్థానికులు తెలిపారు. ఏసీబీ అధికారులు తనిఖీలు పూర్తి చేసి వివరాలు వెల్లడించనున్నారు.

Leave a Reply