ICC T20 Rankings | అభిషేక్ శర్మ దూకుడు.. జెట్ స్పీడ్ తో దూసుకొచ్చిన శతక వీరుడు !
ఇంగ్లండ్ తో జరిగిన ఐదో టీ20లో రికార్డు శతకం బాదిన టీమిండియా యువ ఆల్ రౌండర్ అభిషేక్ శర్మ టీ20 ర్యాంకింగ్స్ లో 38 స్థానాలు ఎగబాకి 829 పాయింట్లతో రెండో స్థానానికి చేరుకున్నాడు.
ఆస్ట్రేలియా స్టార్ ట్రావిస్ హెడ్ (855 పాయింట్లు) తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. తిలక్ వర్మ (803 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచాడు. టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఐదో స్థానంలో ఉన్నాడు.
అయితే, అభిషేక్ శర్మ కేవలం బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లోనే కాకుండా ఆల్‌రౌండర్ విభాగంలోనూ కూడా 31 స్థానాలు ఎగబాకి 13వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.
బౌలింగ్ విభాగంలో..
ఇక ఇదే సిరీస్‌లో.. ఇంగ్లండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన వరుణ్ చక్రవర్తి మూడు స్థానాలు ఎగబాకి మూడో ర్యాంక్‌కు చేరుకున్నాడు.
వెస్టిండీస్ బౌలర్ అకీల్ హుస్సేన్ (707 పాయింట్లు) అగ్రస్థానంలో నిలిచాడు. ఆదిల్ రషీద్, వరుణ్ చక్రవర్తి 705 పాయింట్లతో రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. రవి బిష్ణోయ్ (671 పాయింట్లు) నాలుగు స్థానాలు ఎగబాకి ఆరో ర్యాంక్‌కు చేరుకున్నాడు.