అబ్దుల్ కలాం జయంతి వేడుకలు
శావల్యాపురం, ఆంధ్రప్రభ : నీతి, నిజాయితీతో పాటు దేశభక్తికి నిలువెత్తు నిదర్శనమైన మహోన్నత వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం అని హెచ్ఎం బొడ్డపాటి విజయలక్ష్మి అన్నారు. మండల కేంద్రమైన శావల్యాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ విద్యార్థులు కలాం జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ సెక్రెటరీ బెజవాడ నాగేశ్వరావు, ఉపాధ్యాయులు గురుబాబు, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు ఉన్నారు.