పెద్దపల్లి, ఆంధ్రప్రభ : ప్రజావాణి (Prajavani) లో యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన పెద్దపల్లి జిల్లా (Peddapally district) కలెక్టరేట్ లో సోమవారం చోటుచేసుకుంది. కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేట (Kishtampet) కు చెందిన సతీష్ (Satish) అనే యువకుడు తన తండ్రి ఉద్యోగం తనకు ఇవ్వడం లేదని మనస్థాపానికి గురై కలెక్టర్ (Collector) ఎదుట పురుగుల మందు తాగేందుకూ ప్రయత్నించడంతో సిబ్బంది అడుకున్నారు.
విధినిర్వహణ (Duty management)లో పాముకాటు కు గురైన తన తండ్రి చనిపోయాడని, తన తండ్రి ఉద్యోగం ఇవ్వాలని పలుమార్లు అధికారులకు విజ్ఞప్తి చేసిన పట్టించుకోకపోవడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సతీష్ ((Satish) ను ఆసుపత్రికి తరలించారు.