సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి..

  • ఆటోవాల‌కు రూ.24 వేలు కాంగ్రెస్ బాకీ ప‌డింది

సిరిసిల్ల ప్ర‌తినిధి, ఆంధ్ర‌ప్ర‌భ : ప్రభుత్వం మెడలు వంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసుకుందామని ఆటో డ్రైవ‌ర్ల‌కు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ పిలుపు ఇచ్చారు. ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఆటో డ్రైవర్‌ను ఆయ‌న ప‌రామ‌ర్శించారు. ఆటో డ్రైవర్లు ఎవరు కూడా ఆత్మస్థైర్యం కోల్పోవద్దు, ధైర్యంగా ఉండాలి, జీవితం విలువైంద‌ని అన్నారు.

వెంటనే ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఆటో డ్రైవర్లకు బీమా సౌకర్యంతో పాటు, ఏడాదికి రూ.12,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని అనేక హామీలు ఇచ్చిందని గుర్తు చేశారు.

అయితే, ఆరు నెలలు గడిచినా ఒక్క ఆటో డ్రైవర్‌కు కూడా ఆర్థిక సాయం చేయలేదని విమర్శించారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందిస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, ఇక్కడ మాత్రం ఒక్కరికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సహాయం చేయలేకపోవడం దారుణమన్నారు. డ్రైవర్లకు ఇప్పటికే 24 నెలల బకాయి (ఒక్కో డ్రైవర్‌కు సుమారు రూ.24,000 చొప్పున) బాకీ పడిందని ఆయన వెల్లడించారు.

రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులతో చనిపోయిన 93 మందికి పైగా ఆటో డ్రైవర్ల సమాచారాన్ని ప్రభుత్వానికి అందించినా, ఇప్పటివరకు స్పందించలేదని కేటీఆర్ అన్నారు. “చనిపోయిన ప్రతి ఆటో కార్మికుని కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రభుత్వం తక్షణమే ఇవ్వాల‌న్నారు.

Leave a Reply