కూకట్‌పల్లి (హైదరాబాద్‌): హైదరాబాద్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. కూకట్‌పల్లి (Kukatpally) సంగీత్‌నగర్‌లో 10ఏళ్ల బాలికను పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగీత్‌నగర్ (Sangeetnagar) లో కుమారుడు, కుమార్తెతో కలిసి దంపతులు నివాసముంటున్నారు. తండ్రి బైక్‌ మెకానిక్ (Bike mechanic).. తల్లి ల్యాబ్‌ టెక్నీషియన్ (Lab Technician). బాలిక కేంద్రీయ విద్యాలయంలో ఆరో తరగతి చదువుతోంది. సోమవారం ఉదయం తల్లిదండ్రులు తమ కుమారుడిని స్కూల్‌కు పంపి విధులకు వెళ్లారు.

కుమార్తెకు స్కూల్‌ సెలవు కావడంతో ఇంట్లోనే ఒంటరిగా ఉంది. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో కుమారుడి (Son) లంచ్‌ బాక్స్‌ తీసుకెళ్లేందుకు తండ్రి ఇంటికి వచ్చాడు. బెడ్‌రూమ్ (Bedroom) లో పొట్టపై కత్తి పోట్లతో బాలిక విగతజీవిగా పడి ఉండటాన్ని ఆయన గమనించాడు. దుండగులు బాలికను హతమార్చినట్లు గుర్తించి కూకట్‌పల్లి పోలీసులకు (police) సమాచారం ఇచ్చారు. బాలానగర్‌ డీసీపీ సురేశ్‌కుమార్‌ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. డాగ్‌ స్క్వాడ్‌, క్లూస్‌టీమ్‌తో ఆధారాలను సేకరించారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం (Postmortem) నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply