మంథని, ఆంధ్రప్రభ : మంథని పట్టణంలో వ్యాపార పెట్టుబడుల పేరిట భారీ మొత్తంలో అప్పులు తీసుకుని, నమ్మించి మోసం చేసిన కేటుగాడు బంధం చంద్రశేఖర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు.
మంథని పట్టణానికి చెందిన బండారి రాజేశం ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంధం చంద్రశేఖర్‌ను మంథని పోలీసులు అరెస్ట్ చేశారు. మంథని కోర్టులో జడ్జి లేకపోవడంతో, అతన్ని గోదావరిఖని జడ్జి ఎదుట హాజరుపరచి కరీంనగర్ జైలుకు రిమాండ్ చేశారు.
బాధితుల నుంచి సుమారు 25 మందికి పైగా రూ.5 కోట్ల నుండి రూ.6 కోట్ల వరకు వడ్డీ ఎక్కువ ఇస్తానని ఆశ చూపి, పథకం ప్రకారము నమ్మించి వసూలు చేసినట్లు సమాచారం. మంథని పరిధిలో జులాయిగా తిరుగుతూ మోసాలకు పాల్పడుతున్న చంద్రశేఖర్‌ను కఠినంగా శిక్షించాలని బాధితులు కోరుతున్నారు.
బంధం చంద్రశేఖర్‌పై మరో ఐదుగురు బాధితులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, వాటి వారెంట్లు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. హెడ్‌మాస్టర్ తాడిచర్ల రాజేశ్వరరావు, ఆకుల కిరణ్, కమ్మగోని రవి వంటి వారు పోలీసులకు ఫిర్యాదులు చేసినట్లు తెలిసింది.

