కార్పొరేటర్ శ్రావణ్ కుమార్ గౌడ్ కు ఘన సన్మానం..

నిజామాబాద్ సాంస్కృతికం, ఆంధ్రప్రభ : నగరంలోని వివేకానంద నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 7వ డివిజన్ కార్పొరేటర్ నిర్మల శ్రావణ్ కుమార్ గౌడ్ కు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా గోపాలకృష్ణ స్వాగత గీతం పాడారు. కార్పొరేటర్ నిర్మల శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ.. తనకు సహకారం అందించి పెద్ద ఎత్తున గెలిపించినందుకు ధన్యవాదములు తెలిపారు.

కుక్కల బెడతా, దోమల నిర్మూలన, సానిటైజరీ, కాలనీలో సమస్యలు పరిష్కరిస్తానని ఆయన తెలిపారు. అధ్యక్షులు అట్లూరి మురళీకృష్ణ కార్పొరేటర్ గా ఎన్నికైన నిర్మల శ్రావణ్ కుమార్ కాలనీ అభివృద్ధి దిశగా కృషి చేయాలని కోరారు. ప్రధాన కార్యదర్శి చెరుకుల లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ.. కాలనీలో ఉన్న సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ మారోజు కిషన్ అధ్యక్షులు అట్లూరి మురళీకృష్ణ, ప్రధాన కార్యదర్శి చెరుకుల లక్ష్మణ్ గౌడ్, కోశాధికారి కోనేరు గంగాధర్, శ్రీనివాస్, శ్యామ్, దేవి దాస్, శ్రీధర్ రాజు, హనుమాన్లు, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply