గన్నేరువరం, ఆంధ్రప్రభ : మానస దేవి (Manasa Devi) అమ్మవారిని ప్రముఖ సినీ హీరో శ్రీకాంత్ దర్శించుకున్నారు. కరీంనగర్ (Karimnagar) జిల్లా గన్నేరువరం మండలంలోని కాసింపేట మానసా దేవి అమ్మవారిని సినీ హీరో శ్రీకాంత్ (Srikanth), యాక్టర్ భూపాల్ రాజ్, ప్రొడ్యూసర్ విజయ్ లు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
అర్చకులు అమరనాథ్ శర్మ (Amarnath Sharma) మహా ఆశీర్వాదం అందించగా, ఆలయ కమిటీ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి (Yeleti Chandra Reddy) అద్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి, సభ్యులు బద్దం తిరుపతిరెడ్డి, సింగిరెడ్డి లచ్చిరెడ్డి, కర్నే చంద్రయ్య, బద్దం రామ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

