Donald | ట్రంప్ దూకుడు

Donald | ట్రంప్ దూకుడు

  • గ్రీన్ లాండ్‌కు రాష్ట్ర హోదా
  • విలీన దిశ‌గా వ‌డివ‌డి అడుగులు
  • ఆర్కిటిక్‌లో ర‌ష్యా, చైనాను క‌ట్ట‌డి చేయ‌డ‌మే ధ్యేయం

Donald | వెబ్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ దూకుడు ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. ఆర్కిటిక్‌లో ర‌ష్యా, చైనాను క‌ట్ట‌డి చేయ‌డానికి అమెరికా వ‌డివ‌డి అడుగులు వేస్తోంది. ఒక వైపు గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకునే దిశ‌గా ట్రంప్ ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. ఇందులో భాగంగా గ్రీన్‌లాండ్‌కు రాష్ట్ర హోదా పేరుతో బిల్లును ప్రవేశపెట్టారు.

Donald

ఈ బిల్లుతో ఆ ద్వీపాన్ని అమెరికాలో విలీనం చేసుకునేలా ట్రంప్ చర్యలు చేపట్టేందుకు అవకాశం ల‌భిస్తుంది. దీంతో ఆర్కిటిక్ లో రష్యా, చైనాను క‌ట్ట‌డికి ఈ చర్యలు కీల‌కంగా మారుతుంది. వెనెజువెలా మాజీ అధ్యక్షుడు మదురో నిర్బంధం తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ లాండ్‌పై కన్నేశారు. ఆ ద్వీపాన్ని డెన్మార్క్ నుంచి దూరం చేసేందుకు.. అక్కడి ప్రజలకు డబ్బును ఎరగా వేయాలని యోచిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించిన సంగతి తెలిసిందే.

Donald

ఒక్కో వ్యక్తికి ప‌ది వేల డాలర్ల నుంచి లక్ష డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.3 లక్షల నుంచి రూ.90 లక్షల) మధ్య డబ్బు ఇచ్చేందుకు అమెరికా అధికారులు ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. ఇంకో 20 రోజుల్లో ఈ ద్వీపం గురించి మాట్లాడదామంటూ ట్రంప్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

Donald

కాగా.. యూఎస్ నగదు చెల్లింపు ప్రణాళికలను గ్రీన్‌లాండ్‌ నాయకులు తిరస్కరించారు. తమ ప్రాంత భవిష్యత్తును విదేశాలు నిర్ణయించలేవని గ్రీన్‌లాండ్‌ ప్రధాని జెన్స్ ప్రెడరిక్ నీల్సన్ పేర్కొన్నారు. నాటో దేశాలు కూడా యూఎస్ ప్రణాళికపై ఆందోళన వ్యక్తం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

CLICK HERE TO READ కీలక ఎంవోయూలు ఓకే

CLICK HERE TO READ MORE

Leave a Reply