MLA | పారిశుధ్యంపై ప‌ట్టేంపేది?

MLA | పారిశుధ్యంపై ప‌ట్టేంపేది?

  • పరిపాలనపై పట్టులేదు.. చెబితే వినే అధికారి లేడు
  • పందేల పేరుతో వసూళ్ల దందా చేస్తున్న ఎమ్మెల్యే అరవిందబాబు
  • వైయస్సార్ సీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి ధ్వజం

MLA | నరసరావుపేట, ఆంధ్రప్రభ : స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబుకు పరిపాలనపై పట్టు లేదని.. చెబితే వినే అధికారి కూడా లేడని.. పాలన వదిలేసి ఎడ్ల పందేలు, సంక్రాంతి సంబరాలు పేరుతో వసూళ్ల‌ దందా చేస్తున్నారని వైయస్సార్ సీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. పట్టణంలో గుడ్ మార్నింగ్ నరసరావుపేట పేరుతో ఆదివారం నాలుగో వార్డులోని పనస తోటలో ఆయన పర్యటించారు ఈ సందర్భంగా అక్కడే ప్రజలతో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అద్వానంగా ఉన్న కాలువలు, చెత్తాచెదారం పేరుకుపోయిన ప్రాంతాలను ఆయన పరిశీలించారు.

MLA

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ పరిపాలన సరిగా లేదు. ఎక్కడా చెత్త సేకరణ జరగటం లేదు. నగర దీపికలు సరిగా పని చేయడం లేదు. వీధుల్లోనూ, కాల్వల్లోనూ చెత్త తీయడం లేదని విమర్శలు గుప్పించారు. కొత్త పెన్షన్లు అసలు ఇవ్వడం లేదు. ఈ ప్రభుత్వం వచ్చి రెండు ఏళ్లు అయింది. పక్షవాతం వచ్చిన వాళ్లు, దివ్యాంగులు, వితంతువులకి పెన్షన్ ఇవ్వడం లేదు . ఈ ప్రభుత్వం మూడు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసింది. ఒక కొత్త పెన్షన్ లేదు, కొత్త రేషన్ కార్డ్ లేదు. ఏ పథకం కూడా అమలులో లేదు.అమ్మఒడి పథకం కూడా అందరికీ ఇవ్వలేదు. రెండు ఏళ్లకి ఒక్కసారే ఇచ్చారు. మిగిలిన డబ్బు ఏమైంది? అని ప్ర‌శ్నించారు.

Leave a Reply