Innovative idea | శభాష్ రైతన్న..

Innovative idea | శభాష్ రైతన్న..
- వినూత్న ఆలోచనతో అందరి మెప్పు
Innovative idea | నిజాంపేట, ఆంధ్రప్రభ : యాసంగి ప్రారంభం కావడంతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. దుక్కులు దున్నే పనులలో ట్రాక్టర్లు బిజీగా మారాయి. ఒక పొలం నుంచి మరో పొలానికి వెళ్లాలంటే ప్రధాన రహదారులపై ప్రయాణించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో నిజాంపేట మండల కేంద్రంలో గ్రామ రైతు దండు కర్ణాకర్… రోడ్డుపై దమ్ము చక్రాలతో ట్రాక్టర్ వెళ్తే రోడ్డు ధ్వంసం అవుతుందని ఆలోచించాడు. తన ట్రాక్టర్ దమ్ము చక్రాలు రోడ్డుపై పడకుండా మరో ట్రాక్టర్‌కు కట్టి తీసుకెళ్లాడు. రోడ్డుపై ఇనుప చక్రాలు పడకుండా వెళ్తున్న ట్రాక్టర్‌ను స్థానికులు ఆసక్తిగా గమనించారు. ప్రతి ఒక్కరూ ఈ రైతు మాదిరిగా బాధ్యతగా ఆలోచిస్తే రోడ్లు ధ్వంసం కావని స్థానికులు మెచ్చుకున్నారు.
