MLA | ఉమామహేశ్వర బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్ ఆవిష్కరణ

MLA | ఉమామహేశ్వర బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్ ఆవిష్కరణ

MLA | అచ్చంపేట, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ జిల్లా, అచ్చంపేట మండలం రంగాపురం గ్రామంలో ఉన్న శ్రీశైల ఉత్తర ద్వారంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని వాల్ పోస్టర్(Wall poster), కరపత్రాలను టీపీసీసీ ఉపాధ్యక్షుడు, అచ్చంపేట శాసనసభ్యుడు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఈ రోజు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ… శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం ఎంతో ప్రాచీనమైనదని, భక్తుల విశేష ఆరాధన పొందుతున్న ఆలయమని పేర్కొన్నారు. రాబోయే బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

బ్రహ్మోత్సవాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారి కృప పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సిబిఎం ట్రస్ట్ చైర్మన్, ఎమ్మెల్యే సతీమణి డాక్టర్ చిక్కుడు అనురాధ, ఆలయ చైర్మన్ బీరం మాధవరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోపాల్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నేత రంగినేని శ్రీనివాసరావు, నాయకులు కసిరెడ్డి దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply