Miryalaguda | రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి..

Miryalaguda | రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి..

Miryalaguda, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఈదులగూడ చౌరస్తా వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎంను సిమెంట్ ట్యాంకర్ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. డీసీఎంలో ఉన్న టైల్స్.. కూలీల మీద పడటంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని మిర్యాలగూడ పట్టణంలోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

టైల్స్ ను హైదరాబాద్ నుండి గుంటూరుకు తరలిస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద స్థలానికి చేరుకున్న మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు క్రేన్ సహాయంతో రహదారి పై నుండి లారీని.. డీసీఎంని తొలగింపజేసి సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద ఘటన పై కేసు నమోదు చేసుకున్న వన్ టౌన్ సీఐ నాగభూషణం దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply