Monkeys | కోతుల విముక్తి కోసం…

Monkeys | కోతుల విముక్తి కోసం…
Monkeys | టేకుమట్ల, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం రామకృష్ణాపూర్ ( టి) కోతుల(Monkeys) బెడద గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలను ఇబ్బందులు పెడుతున్నాయి. చిన్నపిల్లల పెద్దలు ఇంట్లో నుంచి బయటికి రావాలంటే భయంతో భయపడుతూ ఉండేవారు. ఇంట్లో వస్తువులను, రైతుల పంటలను నాశనం చేస్తూ విచ్చలవిడిగా ఊరు మీద పడి దాదాపు సుమారు 100 నుండి 200 కోతులు కోతులు రోడ్లమీద కొచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి.
ఇది తెలిసి కూడా ఎవరు పట్టించుకోలేదు. కానీ ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో గెలుపొందిన సర్పంచి గునిగంటి రజనిమహేందర్ ప్రజల బాధలను అర్థం చేసుకొని రెండు కొండెంగను తెప్పించడం జరిగింది. గ్రామపంచాయతీ ఎన్నికలలో గెలుపొందిన సర్పంచి గునిగంటి రజని మహేందర్ ప్రజలు అడిగిన వెంటనే బాధను అర్థం చేసుకొని కొండెంగని తెప్పించిన సర్పంచ్ కి గ్రామపంచాయతీ పాలకవర్గానికి రామకృష్ణాపూర్ (టి) గ్రామ ప్రజలు అభినందనలు తెలిపారు.
గెలిచిన వెంటనే ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారం ప్రజల బాధలు అర్థం చేసుకుంటున్న నూతన గ్రామపంచాయతీ పాలకవర్గాన్ని గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
