Arrangements | సీఎం పర్యటనకు ఏర్పాట్లు

Arrangements | సీఎం పర్యటనకు ఏర్పాట్లు
- పరిశీలించిన కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా
Arrangements | గుంటూరు కలెక్టరేట్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 5వ తేదీన గుంటూరు రానున్న నేపథ్యంలో పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్‌తో కలిసి కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఈ రోజు ఏర్పాట్లను పరిశీలించారు. ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్వహిస్తున్నమూడవ ప్రపంచ తెలుగు మహాసభల చివరి రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్న నేపథ్యంలో శ్రీ సత్యసాయి స్పిరిట్యుయల్ ట్రస్ట్‌లో పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస రావు, అదనపు ఎస్పీ హనుమంతు, డీఎస్పీ అబ్దుల్ అజీజ్, తహసీల్దార్ సుభాని, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయ లక్ష్మి, ఆర్ అండ్ బీ పర్యవేక్షక ఇంజనీర్ శ్రీనివాస మూర్తి, తదితరులు పాల్గొన్నారు.
