Warning | పులితో పరేషాన్

Warning | పులితో పరేషాన్
- మళ్లీ కొత్తగూడ ఏజెన్సీలో పులి అలజడి
- అప్రమత్తంగా ఉండాలి
- అటవీ శాఖ హెచ్చరిక
Warning | కొత్తగూడ, ఆంధ్రప్రభ : కొత్తగూడ ఏజెన్సీలో మళ్లీ పులి కలకలం సృష్టిస్తోంది. గతం నుండే ఏజెన్సీలో పులి కదలికలు ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పులి సంచారంతో ఏజెన్సీ ప్రాంతాలు మళ్లీ ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది. అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు అడవుల్లోకి ఎవరూ వెళ్లకుండా ఉండాలని, పశువులను మేతకు అడవులకు తీసుకెళ్ళొద్దని ప్రచారం చేస్తున్నారు. గత మూడు సంవత్సరాల క్రితం రాంపూర్ అడవిలో ఆవును పులి దాడి చేసి చంపడంతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు నిరంతరం అడవిలో పర్యవేక్షణ నిఘా పెంచారు.
మండలంలోని ఓటాయి, రాంపూర్, కర్నగండి అడవుల్లోనే పులి సంచరిస్తున్నట్లు సమాచారం ఉన్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. పులి కదలికలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. అటవీ సమీప గ్రామాల ప్రజలు పులి ఎటువైపు నుండి దాడి చేస్తుందోనని భయాందోళన చెండుతున్నారు.

Warning | అప్రమత్తంగా ఉండాలి
ఎఫ్ఆర్ఓ వజహాత్
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎఫ్ఆర్ఓ వజహాత్ అన్నారు. ఒంటరిగా అడవుల్లోకి వెళ్ళకూడదని, పశువులను అడవుల్లోకి మేతకు తీసుకెళ్లొద్దన్నారు. పులి ఆనవాళ్లు తెలిస్తే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజల భద్రతతో పాటుగా వన్యప్రాణుల రక్షణ కూడా ప్రధాన లక్ష్యమని ఎఫ్ఆర్ఓ వజహాత్ తెలిపారు.
