Krishnakumari | కూటమి చిత్తశుద్ధికి నిదర్శనం..

Krishnakumari | కూటమి చిత్తశుద్ధికి నిదర్శనం..
Krishnakumari | చల్లపల్లి, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంవత్సరం సందర్భంగా ఒక్కరోజు ముందుగానే పింఛన్ దారులకు పింఛన్లు పంపిణీ చేయటం కూటమి ప్రభుత్వానికి ప్రజల సంక్షేమం పట్ల ఉన్న చిత్తశుద్ధిని తెలియచేస్తోందని చల్లపల్లి సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి అన్నారు. మండల కేంద్రమైన చల్లపల్లిలో ఉదయం పింఛన్ల పంపిణీ ముమ్మరంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం సచివాలయ ఉద్యోగులు మంచును సైతం లెక్కచేయకుండా ఉదయాన్నే పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. గ్రామంలో పలు ప్రాంతాల్లో సర్పంచ్ కృష్ణకుమారి ఉద్యోగులతో కలిసి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేసి వారికి నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేశారు. ఒక్క రోజు ముందుగానే పింఛన్లు అందించిన ప్రభుత్వానికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.
