ROAD | ట్రాఫిక్ అవ‌స్థ‌లు

ROAD | ట్రాఫిక్ అవ‌స్థ‌లు

  • రోడ్లపైనే కిరాణా సామాన్లు వస్తువులు
  • వస్తువుల దిగుమతితో ఇబ్బందులు
  • ప్రభుత్వ ఆసుపత్రి, మార్కెట్‌కు వెళ్లే దారిలో…
  • వాహ‌న‌దారుల ఇబ్బందులు

ROAD | పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలో రోడ్లను ఆక్రమించి కిరాణా వస్తువులు, సామాన్లు పెడుతున్నారు. అంతేకాకుండా మధ్యాహ్న సమయంలో లారీలు, ఆటోల ద్వారా సామాన్లను దిగుమతి మూలంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి, కూరగాయల మార్కెట్, ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి వెళ్లే మార్గంలో వాహ‌న‌దారులు, పాద‌చారులు అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. వాణి బుక్‌స్టాల్ నుంచి మార్కెట్ చికెన్ సెంటర్ ల వరకు వాహనదారులు, పాదచారులు వెళ్లాలంటే ట్రాపిక్‌ జామ్ అవుతుండ‌టంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన దారిలో ఇరువైపులా కిరాణా వస్తువులు పెట్ట‌డం, రోడ్లపై లారీల ద్వారా కిరాణా వస్తువులను దిగుమతి చేసుకోవడం వలన ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది.

ఈ వీధిలో కిరాణా షాపుల యజమానులు పోటాపోటీగా కిరాణా వస్తువులను రోడ్డుపై పెడుతూ వాహనాల ట్రాఫిక్ ఇబ్బందులు కలిగే విధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఈ వీధిలో ఒక వాహనానికి మరో వాహనం ఎదురైతే వెళ్ల‌డం క‌ష్టంగా మారింద‌ని ప‌లువురు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. నడవడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నామ‌ని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్ప‌టికైనా ట్రాఫిక్ పోలీసులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతున్నారు.

Leave a Reply