Christmas | యేసు బోధనలు అనుస‌ర‌ణీయం

Christmas | యేసు బోధనలు అనుస‌ర‌ణీయం

  • మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు

Christmas | లక్షేట్టిపేట, ఆంధ్రప్రభ : యేసుక్రీస్తు బోధనలు యావత్ ప్రపంచానికి ఆదర్శనీయమని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు అన్నారు. గురువారం పట్టణంలోని సీఎస్‌ఐ చర్చిలో క్రిస్మస్ సందర్భంగా కేక్ కట్ చేసి, పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతీ మనిషిలో మంచి కోసం జరిగే పరివర్తనకు ప్రార్థ‌నలే మూలమని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ యేసు ప్రభువు చూపిన ప్రేమ, క్షమాగుణం, కరుణ, శాంతి మార్గాలను ఆచరణలో చూపాలన్నారు. మాజీ సీఎం కేసీఆర్ క్రైస్తవుల పట్ల అత్యంత ప్రేమ, ఆదరణ చూపారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో చర్చ్ ఫాదర్, నాయకులు విజిత్ రావు, పోడేటి శ్రీనివాస్ గౌడ్, పాదం శ్రీనివాస్, గోళ్ళ రవీందర్, చాంద్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply