MPDO | నూతన సర్పంచ్‌లు గ్రామాల అభివృద్ధికి కృషిచేయాలి….

MPDO | నూతన సర్పంచ్‌లు గ్రామాల అభివృద్ధికి కృషిచేయాలి….

ఊట్కూర్, ఆంధ్రప్రభ : ప్రజల చేత ఎన్నుకోబడిన నూతన సర్పంచులు సర్పంచ్ లు, ఉప సర్పంచ్‌లు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఊట్కూర్ ఎంపీడీవో కిషోర్ కుమార్ అన్నారు. ఈ రోజు నారాయణపేటజిల్లా ఊట్కూర్ ఎంపీడీవో కిషోర్ కుమార్‌ను బిజ్వార్ సర్పంచు కొల్లంపల్లి అంజయ్య, వల్లంపల్లి ఉపసర్పంచ్ నర్సప్ప నూతనంగా గెలుపొందడంతో ఎంపీడీవో ను కలిసి సన్మానించారు. బిజ్వార్ బీజేపీ సర్పంచ్ అంజయ్య, వల్లంపల్లి కాంగ్రెస్ ఉపసర్పంచ్ గూర్లపల్లి నర్సప్పలకు ఎంపీడీవో శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. ఈ సందర్భంగా ఎంపీడీవోమాట్లాడుతూ.. అభివృద్ధికి సర్పంచ్‌ల బాధ్యత కీలకమని బాధ్యతాయుతంగా పనులు చేయాలన్నారు.

గ్రామాల అభివృద్ధి(Development)కి తమ వంతు సహకారం ఉంటుందని నూతన పాలకవర్గం కలిసికట్టుగా సమస్యలు పరిష్కరించాలని సూచించారు. గ్రామాల ప్రజలకు సేవ చేసే అవకాశం దేవుడు ఇచ్చిన గొప్ప వరమని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలు చేయడంతో పాటు నిరంతరం ప్రజల మధ్య ఉండడం వారి ద్వారా సమస్యలు వెలుగులోకి వస్తాయని వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆంజనేయులు గౌడ్, రాజప్ప, రాఘవేందర్, నర్సప్ప, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply