Munugodu | సర్వమత సారం మానవత్వమే

Munugodu | సర్వమత సారం మానవత్వమే
- తహసిల్దార్ నేలపట్ల నరేష్.
Munugodu | మునుగోడు, ఆంధ్రప్రభ : సర్వ మతాల సారాంశం మానవత్వమేనని ప్రతి ఒక్కరిలో ఓర్పు, సహనం పెరిగి ఐక్యతగా జీవించాలని తహసిల్దార్ నేలపట్ల నరేష్ సూచించారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా క్రైస్తవులకు మండల పరిధిలోని సింగారం హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చిలో ఈ రోజు ఏర్పాటు చేసిన క్రిస్మస్ ప్రేమ విందులో పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరిలో పాపాలను పారద్రోలి ప్రతి ఇంట సౌభాగ్యాలు నిండాలన్నారు. ప్రార్థనలతో అన్ని రంగాలు మరింత అభివృద్ధి చెంది శాంతియుత సమాజంగా మారాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
ఎస్సై ఇరుగు రవి మాట్లాడుతూ… ప్రజలందరిలో ప్రేమ, కరుణ పెరిగి ఇతరుల పట్ల స్నేహ పూర్వకంగా వ్యవహరిస్తూ పేదలు, అనాధల పట్ల సేవాగుణం కలిగి వారికి అండగా నిలవాలన్నారు. అన్ని మతాలు మానవత్వంగా జీవించడమే నేర్పిస్తున్నాయని వాటిని సక్రమంగా ఆచరణలో పెట్టాలని అన్నారు. పాస్టర్స్ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు, సింగారం హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ పాస్టర్ పోగుల విజయ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో చండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దోటి నారాయణ, డైరెక్టర్ కుంభం చెన్నారెడ్డి, సింగారం గ్రామ సర్పంచ్ కుంభం అండాలు రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు భీమనపల్లి సైదులు, సీనియర్ నాయకులు జాల వెంకటేశ్వర్లు, వార్డు సభ్యులు గుర్రాల సురేష్, పిట్టల శ్రావణ్, నాయకులు కుంభం సురేందర్ రెడ్డి, జిల్లా వెంకటేశ్వర్లు, పాస్టర్లు ఆదాం, సీమ్యోను, ప్రభాకర్, ఆనంద్, తిమోతి, దైవజనులు తదితరులు పాల్గొన్నారు.
