Honor | నూతన పాలకవర్గానికి సన్మానం..

Honor | నిజాంపేట, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని కల్వకుంట నూతన గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు శనివారం మాజీ ఎంపీ, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన పాలకవర్గాన్ని ఆయన శాలువాతో సన్మానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతుందన్నారు. రానున్న ఎంపీటీసీ జెడ్పిటిసి ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అందే కొండల్ రెడ్డి, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
