AP CM | ఏపీలో పరిశ్రమలు

AP CM | ఏపీలో పరిశ్రమలు
- 10 లక్షల కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు
- సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
AP CM | ముత్తుకూరు, డిసెంబర్ 19 (ఆంధ్రప్రభ) : కూటమి ప్రభుత్వ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్‌లో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమల స్థాపన జరుగుతుందని, సీఎం చంద్రబాబునాయుడు పరిపాలనకు ఇది నిదర్శనమని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రం మత్స్య కళాశాలలో ఏపీ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కార్పొరేషన్ ద్వారా మెగా జాబ్‌మేళా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. 15 కంపెనీలు ఈ మేళాకు హాజరై నిరుద్యోగ యువతీ , యువకులకు ఉద్యోగాలు కల్పించే అంశం పైన రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిర్వహించారు.
అనంతరం ఎమ్మెల్యే సోమిరెడ్డి మాట్లాడారు. పరిశ్రమల స్థాపన ఉంటేనే ఉద్యోగాలు కల్పన ఉంటుందన్నారు. పదవ తరగతి నుంచి పైస్థాయి చదువు వరకు మెగా జాబ్‌మేళాలో ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, మండల పార్టీ అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్, తహసీల్దార్ స్వప్న, ఎంపీడీవో నాగమణి, తదితరులు పాల్గొన్నారు.
