BKR Foundation | సాఫీగా పోలింగ్..

BKR Foundation | సాఫీగా పోలింగ్..

  • ఓటింగ్ సరేలేని పరిశీలించిన జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్
  • సంగంబండలో ఓటేసిన బీకేఆర్ ఫౌండేషన్ చైర్మన్ గవినోళ్ళ బాలకృష్ణారెడ్డి

BKR Foundation | మక్తల్, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ ఎన్నికలు మూడవ విడత పోలింగ్ మక్తల్ నియోజకవర్గం(Constituency)లో ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం7గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛ‌నీయ సంఘటనలు జరగకుండా ప్రతీ పోలింగ్ స్టేషన్లో(polling station) పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఊట్కూర్ మక్తల్ మండలాల్లో పర్యటించి పోలింగ్ సరళిని పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. ముంబయి హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో బతుకుదెరువు కోసం వెళ్లిన ఓట్లను అభ్యర్థులు ప్రత్యేక వాహనాల్లో తీసుకుని వచ్చి తమ అభ్యర్థులకు ఓటు వేయించారు.

మక్తల్ మండలంలోని సంగంబండ పోలింగ్ కేంద్రం వద్ద అధికార కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బీకేఆర్ ఫౌండేషన్(BKR Foundation) చైర్మన్ గవినోళ్ళ బాలకృష్ణ రెడ్డి ఓటు వేశారు. అదేవిధంగా కాంగ్రెస్ ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి నర్వ మండలంలోని కడుమూరులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు జిల్లావ్యాప్తంగా 65 శాతం ఓటింగ్ నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు.

Leave a Reply