Karunakar | గెలిపిస్తే అభివృద్ధి చేస్తా :

Karunakar | గెలిపిస్తే అభివృద్ధి చేస్తా :

Karunakar | నర్సంపేట, ఆంధ్రప్రభ : గెలిపిస్తే అభివృద్ధి చేస్తానని నర్సంపేట మండలంలోని పాత మగ్దుంపురం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నలమాస కరుణాకర్ హామీ ఇచ్చారు. నర్సంపేట పట్టణానికి దగ్గర ఉన్న పాత మగ్దుంపురంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కరుణాకర్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అండదండలతో అభివృద్ధి చేస్తానని, అసంపూర్తిగా ఉన్న గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న పనులన్నీ కూడా పూర్తిచేసి ఇచ్చిన హామీని నెరవేరుస్తారని కరుణాకర్ ప్రచారంలో ప్రజలకు హామీ ఇస్తున్నారు.

రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మాధవరెడ్డి అండతో అభివృద్ధి చేసి చూపిస్తానని పేర్కొన్నారు. గ్రామంలో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లతో పాటు గ్రామంలోనే అంతర్గత రోడ్లు, డ్రైనేజీలను పూర్తి చేసి ఐదేళ్లు మీకు సేవ చేస్తానని తెలిపారు. తనను గెలిపించి గ్రామాభివృద్ధికి సహకరించాలని, ఎప్పటికప్పుడు మీ మధ్య ఉంటూ ప్రజల సమక్షంలో సమస్యలు త‌న సమస్యగా ఎంచుకొని పరిష్కరిస్తానని తెలిపారు. ఎమ్మెల్యే అండతోనే పనులన్నీ సకాలంలో పూర్తి చేసి గ్రామాభివృద్ధికి తోడ్పడుతానని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను కూడా పరిష్కరించి వీధిలైట్లు, అసంపూర్తిగా ఉన్న పనులను కూడా పూర్తి చేస్తారని తెలిపారు. నేటితో ప్రచారం ముగియ‌నున్న‌ సందర్భంగా ఆయన ఉదయం ప్రచారం చేశారు. ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలేపల్లి బిక్షపతితో పాటు నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply