CM Chandrababu Naidu | ఢిల్లీలో లోకేష్‌..

CM Chandrababu Naidu | ఢిల్లీలో లోకేష్‌..

CM Chandrababu Naidu | ఆంధ్రప్రభ వెడ్ డెస్క్ : నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) ఢిల్లీలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. రాష్ట్ర రవాణా, రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీతో పాటు, ఇతర కేంద్ర మంత్రులతో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అనేక ప్రాజెక్టులు, నిధులు, పరిష్కారాల పై చర్చించే అవకాశం ఉంది.

రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లను లోకేష్ కలవనున్నారు. ఈ సమావేశాల్లో విశాఖ రిఫైనరీ విస్తరణ, రైల్వే ప్రాజెక్టులు, ఇతర ఇన్‌ఫ్రా(Infrastructure) అంశాలు చర్చించే అవకాశం ఉంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షాని కూడా కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ భేటీలో ఇద్దరి మధ్య రాజకీయ, భద్రతా అంశాలపై చర్చకు రావచ్చు.

కేంద్ర మంత్రులతో భేటీ అనంతరం మంత్రి నారా లోకేష్‌ ఢిల్లీ(Delhi) నుంచి నేరుగా వైజాగ్ చేరుకోనున్నారు. మంగళవారం విశాఖపట్నంలో జరిగే పలు కార్యక్రమాల్లో నారా లోకేష్ పాల్గొంటారు. మరో వైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) సైతం డిసెంబర్ 19వ తేదీన న్యూఢిల్లీలో పర్యటించనున్నారు. అందుకోసం డిసెంబర్ 18వ తేదీ సాయంత్రం విజయవాడ విమానాశ్రయం నుంచి నేరుగా ఢిల్లీకి చేరుకుంటారు. ఆ రాత్రి పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు సమావేశం కానున్నట్లు సమాచారం.

Leave a Reply