Manohar | గ్రామాభివృద్ధే ధ్యేయం

Manohar | గ్రామాభివృద్ధే ధ్యేయం

Manohar | అచ్చంపేట, ఆంధ్ర‌ప్ర‌భ : త‌న‌కు గ్రామాభివృద్ధే ధ్యేయ‌మ‌ని వీరం రాజు పల్లి సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పానుగంటి మనోహర్ అన్నారు. త‌న‌కు గ్రామస్తులు ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. తాను గ్రామ ప్రజల కష్టసుఖాలను దగ్గరుండి చూస్తూ పెరిగానని, ఉమ్మడి రామాజీ పల్లి గ్రామంలో గతంలో తన తల్లి టీడీపీ తరఫున, అనంతరం తన భార్య టీఆర్ఎస్ పార్టీ తరఫున సర్పంచ్‌లుగా ఎన్నిక‌య్యార‌ని అన్నారు. తనను కూడా ఆదరించి సర్పంచ్‌గా ఎన్నుకోవాలని కోరారు. గ్రామ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు చేరేలా నిస్వార్ధంగా, నిష్పక్షపాతంగా పనిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మైలారం లోకేష్, గండు నవీన్ గౌడ్, మైలారం దశరథం, మైలారం బాలస్వామి, మురళి గౌడ్, వెంకటయ్య, దొంతి శ్రీశైలం, పరమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply