TRAIN | గుడివాడకు వందేభారత్..

TRAIN | గుడివాడకు వందేభారత్..
- చెన్నై – విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
- గుడివాడ రైల్వేస్టేషన్ హాల్ట్, ఆ తర్వాత భీమవరంలో కూడా..
- 15న విజయవాడ రైల్వేస్టేషన్లో ప్రారంభోత్సవం…17 నుంచి అమలు
TRAIN | విజయవాడ, ఆంధ్రప్రభ : వందే భారత్ రైలు సేవలు ఇక గుడివాడ ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. చెన్నై- విజయవాడ వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు గుడివాడలో కూడా ఆగనుంది. చెన్నై- విజయవాడ వందేభారత్ (20677) రైలును నర్సాపురం వరకు రైల్వే శాఖ పొడిగించింది. ఈ క్రమంలో గుడివాడ రైల్వే స్టేషన్లో హాల్ట్ ఇవ్వటం జరిగింది. విజయవాడ -గుడివాడ (Gudivada) మధ్య వందేభారత్ హైస్పీడ్ రైల్లో ప్రజలు రాకపోకలు సాగించవచ్చు. గుడివాడ ప్రజలు నర్సాపురం కూడా నేరుగా వెళ్లవచ్చు. అలాగే చెన్నైకు కూడా నేరుగా ప్రయాణించవచ్చు.
కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ పట్టుబట్టి నరసాపురం వరకు వందేభారత్ (Vandebharat) ను పొడిగించుకున్నారు. దీంతో గుడివాడ ప్రజలకు వందేభారత్ రైలు అవకాశం దక్కింది. ఈనెల 15వ తేదీన విజయవాడ రైల్వేస్టేషన్లో గుడివాడ మీదుగా నరసాపురానికి వందే భారత్ రైలును ప్రారంభించనున్నారు. 17వ తేదీ నుంచి నరసాపురం వరకు పొడిగింపు అమలులోకి తీసుకురానున్నారు. పొడిగించిన వందేభారత్ రైలు 17న చెన్నైలో ఉదయం 5.30 గంటకు ప్రారంభమవుతుంది. విజయవాడకు 11.45 గంటలకు వస్తుంది. ఇక్కడి నుంచి గుడివాడ మధ్యాహ్నం 12.30 గంటలకు చేరుతుంది. భీమవరం టౌన్ 13.15 గంటలకు, నర్సాపురం రైల్వేస్టేషన్కు 2.10 గంటలకు వెళ్తుంది.
