Delhi | తెలంగాణ‌కు సీఎం రేవంతా..? నేనా..? కౌంట‌ర్ ఇచ్చిన కిష‌న్ రెడ్డి

న్యూఢిల్లీ – తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డా లేక నేనా? అంటూ కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి రేవంత్ ను నిల‌దీశారు.. తెలంగాణ‌లో ప్రాజెక్ట్ ల‌ను అడ్డుకుంటున్నార‌ని, కేంద్రం నుంచి ఎటువంటి సాయం అంద‌కుండా చేస్తున్నార‌ని రేవంత్ చేసిన వ్యాఖ్యాల‌పై ఆయ‌న ధీటుగా స్పందించారు.. ఢిల్లీలోని ఆయ‌న కార్యాల‌యంలో నేడు మీడియాతో మాట్లాడుతూ, ఎన్నిక‌ల‌లో కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి హామీలు ఇచ్చారా? అంటూ కాంగ్రెస్ ను ప్ర‌శ్నించారు. తెలంగాణకు సంబంధించిన అన్ని ప్రాజెక్టుల విషయంలో తాను రాష్ట్ర ముఖ్యమంత్రులతో మాట్లాడుతూ నిధులు తీసుకొస్తున్నాన‌ని చెప్పారు.

తాను ఒక్క ప్రాజెక్టు అడ్డుకున్నట్టు రుజువు చూపించాలని సవాల్ చేశారు.. చేతకాని, దమ్ములేని సీఎం ఇత‌రుల‌పై నెపం మోపి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నార‌ని కిష‌న్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు..మెట్రో కోసం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక్క పైసా లేద‌ని, కాని దానిని విస్త‌రిస్తామంటూ పెద్ద పెద్ద మాట‌లు రేవంత్ చెబుతున్నార‌ని అన్నారు.. ఈ మెట్రో విస్త‌ర‌ణ కోసం మొన్న ప్రతిపాదనలు పంపారని వివ‌రించారు. సీఎంగా ఉన్న వ్యక్తి ఏమాత్రం అవగాహన లేకుండా దుందుడుకు వైఖరితో వ్యవహరిస్తున్నార‌ని అన్నారు. రేవంత్ బ్లాక్ మెయిల్ రాజ‌కీయాల‌కు తాను భ‌య‌ప‌డేది లేద‌ని తేల్చి చెప్పారు కిష‌న్ రెడ్డి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *