Naresh | ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తా

Naresh | ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తా

  • వాగోడ్డు తండా లోలెవల్ కాజ్ వే స్థానంలో బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తా
  • గ్రామంలో మిగిలిపోయిన సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీల నిర్మాణం కృషి
  • మాచినేనిపేట తండాను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా
  • కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సపవట్ నరేష్

Naresh | జూలూరుపాడు, ఆంధ్రప్రభ : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీచేస్తున్న త‌న‌ను ఆశీర్వదించి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు సపవట్ నరేష్ ఓటర్లను అభ్యర్థించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం, లోపలి మాచినేని పేట గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సపవట్ నరేష్ ఎన్నికల బరిలో నిలిచారు. ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని కోరారు.

2019 పంచాయతీ ఎన్నికల్లో తన తల్లిని పంచాయతీ సర్పంచ్ గా గెలిపించారని, గ్రామ ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా గ్రామ అభివృద్ధి కోసం పని చేశామన్నారు. సీసీ రోడ్ల నిర్మాణం, సైడ్ డ్రైనేజీల నిర్మాణం, వీధి దీపాలు, గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేసిన కుటుంబాన్ని ఎన్నికల్లో ఆదరించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను సపవట్ నరేష్ అభ్యర్థించారు. మాచినేని పేట, వాగొడ్డు తండాలను అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని ప్రజలకు హామీ ఇచ్చారు. భారీ వర్షాలకు వాగొడ్డు తండాకు వెళ్ళే లోలెవల్ కాజ్ వే దెబ్బతిందన్నారు. వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ దృష్టికి వాగొడ్డు తండా వాసుల సమస్యను తీసుకు వెళతానన్నారు. శాశ్వత పరిష్కారానికి బ్రిడ్జి నిర్మాణానికి కావాల్సిన నిధులను సాధించేందుకు కృషి చేస్తానని, సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన సపవట్ నరేష్ ఓటర్లను కోరారు.

Leave a Reply