Waqf Bill | ‘వక్ఫ్‌ సవరణ బిల్లు-2024’ – కేంద్ర కేబినెట్ ఆమోదం …

‘వక్ఫ్‌ సవరణ బిల్లు-2024’పై అధ్యయనం జరిపిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) రూపొందించిన నివేదికకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో మార్చి 10వ తేది నుంచి ప్రారంభంకానున్న‌ రెండో ద‌ఫా బడ్జెట్‌ సమావేశాల్లో ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి చర్చించేందుకు మార్గం సుగమమైంది. ఇది ఇలా ఉంటే
కాగా, వక్ఫ్‌(సవరణ) బిల్లుపై ఏర్పడిన జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) తన నివేదికను ఈనెల 13న పార్లమెంటులో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. లోక్‌సభలో జేపీసీకి చైర్మన్‌గా వ్యవహరించిన జగదాంబికా పాల్‌, రాజ్యసభలో జేపీసీ సభ్యురాలు మేధా విశ్రమ్‌ కుల్‌కర్ణి నివేదికను ప్రవేశపెట్టారు. అయితే, జేపీసీలో భాగంగా ఉన్న ప్రతిపక్ష సభ్యులు వ్యక్తం చేసిన భిన్నాభిప్రాయాలను ఈ నివేదిక నుంచి తొలగించారని విపక్ష సభ్యులు ఆరోపించారు.

నివేదికను లోక్‌సభలో ప్రవేశపెడుతున్నప్పుడు ప్రతిపక్ష ఎంపీలు వాకౌట్‌ చేసి నిరసన తెలిపారు. అయితే, భిన్నాభిప్రాయాలను నివేదికలో చేర్చడానికి తమకేమీ అభ్యంతరం లేదని లోక్‌సభ స్పీకర్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తెలిపారు. జేపీసీ నివేదికను ఉపసంహరించుకోవాలని రాజ్యసభలో విపక్ష ఎంపీలు నినాదాలు చేశారు. ఇది ఫేక్‌ నివేదిక అని, మెజారిటీ సభ్యుల ఆలోచనలనే నివేదికలో పొందుపర్చడం అప్రజాస్వామికమని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. కాగా, నివేదికలోని కొన్ని భాగాలకు తొలగించే అధికారం కమిటీ చైర్మన్‌కు ఉంటుందని కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు పేర్కొన్నారు. ఇక విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు నిరసనల మధ్యే ఈ బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి.

ఈ నేపథ్యంలోనే గత వారం ఈ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించినట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. దీంతో మార్చి 10న ప్రారంభం కానున్న రెండో దఫా బడ్జెట్‌ సమావేశాల్లో వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్‌ను క్రమబద్ధీకరించేందుకు ఉద్దేశించిన బిల్లును ప్రవేశపెట్టేందుకు మార్గం సుగసుగమమైంది.

Leave a Reply