పింఛన్ల పంపిణీ కి హాజరు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మార్చి 1న చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. పూతలపట్టు నియోజకవర్గంలో సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. లబ్ధిదారులకు ఫించన్లు పంపిణీ చేయనున్నారు. అలాగే ఈ సందర్భంగా గ్రామస్తులతో సీఎం చంద్రబాబు కొద్దిసేపు ముచ్చటిస్తారు.