In LS : ప్రయాణికుల భద్రతే లక్ష్యం

In LS : ప్రయాణికుల భద్రతే లక్ష్యం
ఇండిగోపై చర్య తప్పదు
పార్లమెంటులో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
( ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ)

ఇండిగో వ్యవహారంపై ఇంటా బయటా రాజకీయ దుమారం రేగిన తరుణంలో.. పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వివరణ ఇవ్వక తప్పలేదు. విమానాల రాకపోకలకు అంతరాయం కలిగించిన ఇండిగో (IndiGo) యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు ( Minister Ram Mohan Naidu) అన్నారు.
ఇండిగోపై విమానయాన నియంత్రణ సంస్థ చర్యలు తీసుకుంది. శీతాకాలం ఇండిగో షెడ్యూల్లో 5 శాతం కోత విధిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. మంగళవారం లోక్‌సభలో ఇండిగో సంక్షోభాన్ని ప్రస్తావిస్తూ.. ఇక ముందు ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే ఏ విమానయాన సంస్థను ఉపేక్షించేది లేదన్నారు. నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే ఇండిగో యజమాన్యానికి షోకాజ్ నోటీసు జారీ చేశామన్నారు. ఇక నుంచి నిబంధనలను పూర్తిగా పాటిస్తామని ఇండిగో స్పష్టంగా హామీ ఇచ్చిందని పేర్కొన్నారు. “డిసెంబర్ 6న 706కి పడిపోయిన ఇండిగో రోజువారీ విమానాలు నిన్న 1800కి పైగా తిరిగాయని, మంగళవారం ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ఇతర విమానయాన సంస్థల కార్యకలాపాలు సజావుగా కొనసాగిస్తున్నాయి.’’ అని వివరించారు.

‘ప్రయాణీకుల భద్రత విషయంలో ఎటువంటి రాజీ ఉండదని స్పష్టం చేసిన నాయుడు..భారతదేశం అంతర్జాతీయ ప్రయాణీకుల భద్రతకు కట్టుబడి ఉందన్నారు. ఇండిగో విమాన సర్వీసులపై విమానయాన నియంత్రణ సంస్థ (DGCA) కీలక నిర్ణయం తీసుకుంది. శీతాకాలానికి సంబంధించి ఇండిగో షెడ్యూల్లో 5 శాతం కోత విధిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం ఈ విమానయాన సంస్థ రోజుకు 2,200 విమానాలు నడుపుతోంది. తాజా కోత నేపథ్యంలో ఒక రోజులో 115కు పైగా విమాన సర్వీసులు తగ్గనున్నాయి.

అన్ని మార్గాల్లో ముఖ్యంగా ఎక్కువ డిమాండ్ ఉన్న మార్గాల్లో సర్వీసులను తగ్గిస్తున్నట్లు తెలిపింది. సవరించిన షెడ్యూల్ వివరాలను బుధవారం సాయంత్రం 5 గంటల లోపు తమకు అందించాలని ఇండిగోకు ఆదేశించినట్లు పేర్కొంది. ఈ కోత విధించిన మార్గాలను ఇతర విమానయాన సంస్థలకు తిరిగి కేటాయించనున్నట్లు వివరించింది.
AlSO READ : IndiGo Crisis | అయ్యో ఇండిగో Andhra Prabha SPL story
ALSO READ : DCGA ORDER : షెడ్యూల్ తగ్గించండి
ALSO READ : indigo crisis | 4,500 బ్యాగేజీలు ప్రయాణికులకు అప్పగింత
