Labor Card | జీపీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం.

Labor Card | జీపీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం.
- పెద్దూర్ జిపి సర్పంచ్ అభ్యర్థి శ్రీలేఖ రాజేష్
Labor Card | కడెం, ఆంధ్రప్రభ : తమ గుర్తు ఫుట్ బాల్ గుర్తుకు ఓటు వేసి తమను గెలిపించాలని పెద్దూర్ జీపీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని పెద్దూర్ జీపీ సర్పంచ్ అభ్యర్థి పి. చింత కింది శ్రీలేఖ రాజేష్ అన్నారు. మండలంలోని పెద్దూర్ కడెం పెద్దూర్ తండా కొల్లం గూడెం గ్రామాలలో పర్యటించి ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
పెద్దూర్ జీపీలో కోతుల, కుక్కల నియంత్రణ(control) చర్యలు తీసుకుంటామన్నారు. విద్యా, వైద్యానికి మొదటి ప్రధాన్యత ఇస్తామన్నారు. మౌలిక వసతులు, సదుపాయాల కోసం కృషి చేస్తామన్నారు. గ్రామంలో ఆడపిల్ల పుడితే వారి పేరు మీద 5వేల రూపాయలు ఫిక్స్ డిపాజిట్(fixed deposit) చేస్తామన్నారు. అర్హులైన వారికి వితంతు, వికలాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళ, బీడీ కార్మికులకు పింఛన్ వచ్చే విధంగా కృషి చేస్తామన్నారు.
అర్హులైన వారందరికీ ఉచితంగా లేబర్ కార్డు(Labor Card) ఇస్తామన్నారు. కులమతాలకు అతీతంగా ఎవరైనా దహన సంస్కారాలకు 5వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తాం అన్నారు. జీపీ పరిధిలోగల గ్రామాలలో వీధి దీపాలు, మురికి కాల్వల నిర్మాణం, రోడ్ల నిర్మాణం పై ప్రత్యేక పర్యవేక్షణ చేపడతామన్నారు. ప్రతి నెల గ్రామసభ నిర్వహించి జీపీ నిధుల సమాచారం పారదర్శకంగా ప్రజలకు వివరిస్తామన్నారు. జీపీ పరిధిలో ప్రజల సంక్షేమమే గ్రామ అభివృద్ధి తమకు ముఖ్యమని ఆమె పేర్కొన్నారు.
