Bigg Boss -9 | మధ్యలో ఒకరు.. చివరిలో ఒకరు ఎలిమినేట్ ?

Bigg Boss -9 | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : బిగ్‌బాస్ 9వ సీజన్ ఫినాలేకి వచ్చేసింది. దాదాపు అటు బిగ్‌బాస్ కుటుంబ సభ్యులు, ఇటు వీక్షకులు కూడా ఫినాలే మూడ్‌లో ఉన్నారు. 14వ వారం(Week 14) మొదటి రోజు నిన్న కుటుంబ సభ్యులకు టాస్క్ ఇస్తూ బిగ్‌బాస్ సూచన మేరకు వారం మధ్యలో కూడా ఒకరు ఎలిమినేట్(Eliminate) అయ్యే అవకాశం లేకపోలేదని వీక్షకులు భావిస్తున్నారు.
టాప్-5కి ఎవరు చేరుతారు? టైటిల్ ఎవరు కొడతారా? అనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ వారం బిగ్‌బాస్ కుటుంబ సభ్యులందరికీ కీలకంగా మారింది. ఈ వారం నామినేషన్ కార్యక్రమం నిర్వహించకుండా బిగ్‌బాస్ డైరెక్టుగా నామినేట్ చేశారు. ఫైనాల్ లిస్టు(Final list)కు చేరిన పడాల కళ్యాణ్ మాత్రమే నామినేషన్‌లో లేరు. మిగిలిన తనూజ, ఇమ్మాన్యుయేల్, డీమాన్ పవన్, భరణి శంకర్, సుమన్‌శెట్టి, సంజన నామినేషన్‌లో ఉన్నారు.
Bigg Boss -9 |టాస్క్ గెలిస్తే ఫైనల్ లిస్టుకు.. ఓడితే అవుట్..

బిగ్‌బాస్ లో టాప్ -5లోకి చేరడానికి ఏడుగురు పోటీ పడుతున్నారు. ఇప్పటికే పడాల కళ్యాణ్ ఫైనల్ లిస్టుకు చేరుకున్నాడు. నాలుగు స్థానాలకు ఆరుగురు పోటీ పడుతున్నారు. ఇందులో ఇద్దరు ఈ వారం బయటకు వెళ్లాల్సి ఉంటుంది. ఇందులో ఒకరు టాస్క్‌ల(tasks) ద్వారా, మరొకరు వీక్షకులు ఓటింగ్(Viewers voting) ప్రకారం నిర్ణయించి బయటకు వెళ్లాల్సి ఉంటుంది. నామినేషన్ నుంచి సేవ్ అయి ఫైనల్ లిస్టుకు చేరడానికి బిగ్ బాస్ టాస్క్‌లు ఇస్తున్నాడు. టాస్క్‌లో పాయింట్(point) బట్టీ నామినేషన్ నుంచి తప్పించుకోవడం, ఒకరు బయటకు వెళ్లే అవకాశం కూడా ఉంటుందని సూచన ప్రాయంగా బిగ్ బాస్(bigg boss) చెప్పాడు. దీంతో ఆరుగురు ఇంటి సభ్యులకు ఈ వారం కీలకంగా మారనుంది.
Bigg Boss -9 |సంజన ఎమోషనల్..

బిగ్‌బాస్ టాస్క్‌లో జీరో మార్కులు వచ్చిన సంజనను జైలు శిక్ష విధించారు. దీంతో సంజన ఎమోషనల్ అయ్యింది. ప్రజల నుంచి ఓటింగ్ బాగా వస్తున్నా ఇంటి సభ్యుల సపోర్టు లేకపోవడంతో తనకు ఇలాంటి పరిస్థితి వస్తోందని వెక్కివెక్కి ఏడ్చింది. బాగా ఎమోషనల్( Emotional) అయిన సంజనాను ఇమ్మాన్యుయేల్, పవన్ ఓదార్చారు.
Bigg Boss -9 |భరణికి బిగ్‌బాస్ సపోర్టు?

బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్ కానీ సభ్యుడుగా ఉన్న భరణి శంకర్‌కు ఈ వారం కెప్టెన్‌గా చేస్తూ బిగ్‌బాస్ నేరుగా నిర్ణయం తీసుకున్నారు. అయితే బిగ్‌బాస్ హౌస్‌లో వీక్షకుల ఓటింగ్ ప్రకారం ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయిన భరణి శంకర్(Bharani Shankar) తోపాటు శ్రీజ కు కూడా అవకాశం ఇస్తూ కొన్ని టాస్క్‌లు ఇచ్చారు. అలాగే ఇంటి సభ్యుల అభిప్రాయాన్ని కూడా తీసుకున్నారు.
దీంతో భరణి శంకర్ మళ్లీ బిగ్‌బాస్ హౌస్‌లోకి ప్రవేశించాడు. ఒకసారి ఓటింగ్ ద్వారా ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ సభ్యుడిని మళ్లీ తీసుకు రావాడం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. అలాగే టాస్క్‌ల ద్వారా కెప్టెన్సీ(Captaincy) కొట్టని భరణికి కెప్టెన్సీ కూడా బిగ్‌బాస్ ఇచ్చాడు. అంటే భరణికి బిగ్‌బాస్ సపోర్టు చేస్తున్నట్లు పలువురు భావిస్తున్నారు. టాప్-5 వరకూ భరణి చేరేపోయే అవకాశం బిగ్‌బాస్ కల్పిస్తున్నాడని చర్చ కొనసాగుతోంది.



