Welcome | బాల సదనాల్లో మహిళా కమిషన్ తనిఖీ

Welcome | బాల సదనాల్లో మహిళా కమిషన్ తనిఖీ

  • విద్యార్థులతో ఆరా – భవిష్యత్తుపై మార్గనిర్దేశం

Welcome | కర్నూలు, ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ(Dr. Rayapati Sailaja), పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితలతో కలిసి పెద్దపాడు బాల సదన్‌ను సందర్శించారు. కర్నూలులోని దామోదరం సంజీవయ్య బాల సదనాన్ని ఆమె పరిశీలించారు.

ఈ సందర్భంగా చిన్నారులు, వసతి గృహ అధ్యాపకులు ఘన స్వాగతం(welcome) పలికారు. బాల్య వివాహాల నివారణపై నిర్వహించిన నాటిక ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. వసతి(Accommodation) గృహంలోని డైనింగ్ హాల్, వంట గది, స్టోర్ రూమ్, విద్యార్థుల పడకల గదులను ఆమె స్వయంగా పరిశీలించారు. వసతులు, ఆహారం, భద్రత, పరిశుభ్రత వంటి అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.


ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ, ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని డాక్టర్ రాయపాటి శైలజ సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న వసతులు, మౌలిక సదుపాయాలపై విద్యార్థులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. బాలల భద్రత, సంక్షేమానికి మహిళా కమిషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆమె ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.

Leave a Reply