Vehicle inspections | పెద్దపల్లి, ఆంధ్రప్రభ : రవాణా శాఖ నిబంధనలు తప్పితే.. జరిమానాలు తప్పవని ట్రాఫిక్ పోలీసులు(Traffic Police) స్పష్టం చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలో స్పెషల్ డ్రైవ్ లో భాగంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. రవాణా శాఖ నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిందేనని.. లేకపోతే జరిమానాలు తప్పవని ట్రాఫిక్ ఏసిపి శ్రీనివాస్, సిఐ అనిల్ వాహనదారులకు తెలియజేశారు. వాహనదారులు ఖచ్చితంగా ధ్రువీకరణ పత్రాలు(Validation documents) కలిగి ఉండాలని, ట్రిపుల్ రైడింగ్ చేస్తే కేసులు తప్పమన్నారు. ట్రాఫిక్ సిగ్నల్ లను జంప్ చేయవద్దని వాహనదారుల రక్షణ కోసమే సిగ్నల్ ఏర్పాటు చేశామన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే.. వారి తల్లిదండ్రులతోపాటు వాహన యజమానుల పై కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రతినిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్(Drunk and drive) తనిఖీలు నిర్వహిస్తున్నామని, మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమానాలతో పాటు జైలు శిక్ష తప్పదు అన్నారు. స్పెషల్ డ్రైవ్ లో నిబంధన ఉల్లంఘించిన పలువురికి జరిమానాలు విధించారు.
Vehicle inspections | రూల్ తప్పితే..

