Eturnagaram | ఎన్నికల బరిలో కాకులమర్రి శ్రీలత..

Eturnagaram | ఎన్నికల బరిలో కాకులమర్రి శ్రీలత..

Eturnagaram, ఆంధ్ర ప్రభ : ఏటూరునాగారం సర్పంచ్ ఎన్నికల బరిలో కాకులమర్రి శ్రీలత (మూడో తరం) నిలిచారు. గ్రామ తొలి సర్పంచ్ గోపాలరావు, రెండో సర్పంచ్ చక్రధర్‌రావు వారసత్వాన్ని శ్రీలత కొనసాగించనున్నారు. దాదాపు 44 ఏళ్ల విరామం తర్వాత ఈ కుటుంబం మళ్లీ పోటీలో ఉంది. మాజీ సీబీఐ డైరెక్టర్ కె. విజయరామారావు (శ్రీలత మామగారు) కృషి వల్లే ఏటూరునాగారంలో ఐటీడీఏ, బస్‌ డిపో ఏర్పాటయ్యాయి. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్‌బాబు తన సతీమణి శ్రీలత విజయం కోసం ప్రచారం చేస్తున్నారు.

Leave a Reply