Collector | త్రిసాయుధ దళాల సేవలు ప్రశంసనీయం..
Collector | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : త్రిసాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకుని, శనివారం జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తన వంతు విరాళాన్ని అందిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… దేశ రక్షణలో త్రిసాయుధ దళాల త్యాగాలు, సేవలు వారి కృషి దేశ ప్రజలకు ఎల్లప్పుడూ గర్వకారణమని పేర్కొన్నారు. మాజీ సైనికుల సేవలు దేశ భద్రతా వ్యవస్థలో అత్యంత కీలకమని ప్రత్యేకంగా అభినందించారు.
త్రిసాయుధ దళాల సంక్షేమార్థం ఏర్పాటు చేసిన ప్రత్యేక నిధికి విరాళాలు అందిస్తున్న ప్రజలందరికీ కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. సేవా భావంతో ముందుకు వస్తున్న ప్రజల సహకారం ప్రశంసనీయం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్, జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఎస్.ఆర్. రత్న రూత్, సూపరింటెండెంట్ మహేంద్రమ్మ, సిబ్బంది రఫిక్ అహ్మద్, పుష్పలత, క్యామరిన్తో పాటు పలువురు మాజీ సైనికులు పాల్గొన్నారు. ప్రజల విరాళాలతో ఈ కార్యక్రమం విజయవంతంగా సాగిందన్నారు.

