AP | వైసీపీ హ‌యాంలో అంబేద్కర్‌కు గౌర‌వం

AP | వైసీపీ హ‌యాంలో అంబేద్కర్‌కు గౌర‌వం

  • రూ 400 కోట్లతో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు
  • ఎన్టీఆర్ జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్
  • వైసిపి ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలు

AP | ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : వైసీపీ ప్రభుత్వ హయాంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు (Dr.BR Ambedkar) సంపూర్ణ గౌరవం ఇచ్చామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ పేర్కొన్నారు. భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వైసీపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వైసీపీ నేతలు ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ (NTR) జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్,, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతూ శైలజ, కార్పొరేటర్లు బండి పుణ్యశీల,, తంగిరాల రామిరెడ్డి తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ ప్రజలు అందరూ ఆరాధించే వ్యక్తి బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. విదేశాలలో కూడా ఆయ‌న‌కు విగ్రహాలు పెట్టి అభిమానిస్తార‌ని, దేశ ప్రజలకు అంబేద్కర్ దైవం లాంటివారన్నారు. ప్రతి ఒక్కరికి హక్కులు కల్పించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని, రాజ్యాంగం ద్వారా దేశ ప్రజల భవిష్యత్తును నిర్ణయించారన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు జగన్ కృషి చేశారని, వైసిపి హయాంలో ప్రతి ఒక్క వర్గానికి జగన్ అండగా నిలిచారన్నారు. నేడు కూటమి హయాంలో ఆ పరిస్థితి లేదని, రెడ్ బుక్ రాజ్యాంగం పెట్టి గుండాయిజం, రౌడీయిజం చేస్తున్నారని ఆరోపించారు. భావితరాలకు అంబేద్కర్ గొప్పతనం తెలిసే విధంగా 400 కోట్లు ఖర్చుపెట్టి అంబేద్కర్ కు జగన్ విగ్రహం పెట్టారని, రాబోయే రోజుల్లో అంబేద్కర్ ఆశయాలను జగన్ నాయకత్వంలో నెరవేరుస్తామన్నారు.

Leave a Reply