Sarpanch Elections | అభివృద్దికి పట్టం కట్టండి..
Sarpanch Elections, షాద్ నగర్, ఆంధ్ర ప్రభ : అంబేద్కర్ ఆశయాలను కొనసాగించి గ్రామాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతానని.. అమ్మలా మీ ఇంటికి వచ్చానని.. ఆదరించి పర్సు గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని ఎలికట్ట సర్పంచ్ అభ్యర్థి సేరి శారద విజ్ఞప్తి చేసారు. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, నిరుద్యోగుల ఉద్యోగ అవకాశాలు కోసం కృషి చేస్తానని అన్నారు. ఒక అవకాశం ఇవ్వాలని.. ప్రజలను కోరారు. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి.. ఏ సమస్యలు తలెత్తకుండా చూస్తానని అన్నారు. లేడీస్ పర్స్ గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు.

