Nari Nari Naduma Murari | సంక్రాంతి బరిలో శర్వా..

Nari Nari Naduma Murari | సంక్రాంతి బరిలో శర్వా..

Nari Nari Naduma Murari, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ నారీ నారీ నడుమ మురారి. ఈ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. సామజజవరగమనతో బ్లాక్ బస్టర్ డెబ్యు చేసిన రామ్ అబ్బరాజు ఈ సినిమాని తెరకెక్కించారు. ఇది ఫెస్టివల్ కి పర్ఫెక్ట్ మూవీ. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో ఎకె ఎంటర్టైన్మెంట్స్ (A.K. Entertainments) బ్యానర్‌ పై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రంలో సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటించారు. ఇప్పటివరకు విడుదలైన ప్రతి ప్రమోషనల్ మెటీరియల్ ప్రేక్షకులలో బజ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు మేకర్స్ ఎక్సయిటింగ్ రిలీజ్ అప్ డేట్ ఇచ్చారు.

నారి నారి నడుమ మురారి 2026లో ప్రపంచ వ్యాప్తంగా సంక్రాంతికి థియేటర్లలోకి రానుంది. ఇది తెలుగు సినిమా రిలీజెస్ కి బిగ్గెస్ట్ సీజన్. ఈ సినిమా పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైమెంట్ కావడంతో సంక్రాంతి (Sankranti) విడుదలకు పర్ఫెక్ట్. శర్వా ఈ పండుగ సమయంలో స్ట్రాంగ్ ట్రాక్ రికార్డ్‌ను కలిగి ఉన్నాడు. శతమానం భవతి, ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రాలు సంక్రాంతి విడుదలై పెద్ద బ్లాక్‌బస్టర్‌లుగా నిలిచాయి. ఇదే జోరులో ఈ పండుగ సెలవులు చిత్రానికి గణనీయమైన ఉత్సాహాన్ని ఇస్తాయని టీం నమ్మకంగా ఉంది.

ఈ చిత్రంలో ట్యాలెంటెడ్ టెక్నికల్ టీం పని చేస్తోంది. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం సమకూరుస్తుండగా, సినిమాటోగ్రఫీని జ్ఞాన శేఖర్ విఎస్, యువరాజ్ సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ కథను భాను బోగవరపు రాశారు. నందు సావిరిగణ సంభాషణలు అందిస్తున్నారు. అజయ్ సుంకర సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మరింత ఎక్సయిటింగ్ కంటెంట్‌ను ప్రామిస్ చేస్తూ ప్రమోషన్స్ త్వరలో ప్రారంభించడానికి టీం సన్నాహాలు చేస్తోంది. మరి.. సరైన సక్సెస్ కోసం తపిస్తున్న శర్వాకు నారీ నారీ నడుమ మురారి ఆశించిన సక్సెస్ అందిస్తుందేమో చూడాలి.

Leave a Reply