BKR Foundation | పాలఉట్లు కొట్టిన వారికి వెండి నగదు బహుకరణ
BKR Foundation | మక్తల్ , ఆంధ్రప్రభ : శ్రీ పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు సాయంత్రం రామ్ లీలా మైదానం(Ram Leela Maidan)లో జరిగిన పాల ఉట్లు కొట్టె కార్యక్రమం వైభవంగా జరిగింది .ఈ సందర్భంగా ఉట్లు కొట్టిన భక్తులకు బికేఆర్ ఫౌండేషన్(BKR Foundation) చైర్మన్ గవినోళ్ళ బాలకృష్ణారెడ్డి 12వేల రూపాయల నగదును అందజేశారు .
అదే విధంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ చైర్మన్ బి.ఆర్.ఎస్ సీనియర్ నాయకులు కొత్త శ్రీనివాస్ గుప్తా ఉట్లు కొట్టిన భక్తులకు 12 తులాల వెండి(12 Tola Silver) కడియం అందజేసి అభినందించారు.
అదేవిధంగా ఉట్లు కొట్టిన 12 మందిని శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందించారు .ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి జి .లక్ష్మారెడ్డి , మాజీ మార్కెట్ చైర్మన్ పి.నర్సింహా గౌడ్ , కాంగ్రెస్ నాయకులు కోళ్త వెంకటేష్, సీఎన్. మూర్తి , బీజేపీ నాయకులు దేవరింటి నరసింహారెడ్డి, కర్ని స్వామి, బి. రాజశేఖర్ రెడ్డి , సుకన్య చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


