తాండూర్ విద్యా భారతి పాఠశాలకు జాతీయ స్థాయి అవార్డు…

  • ఇండియా స్కూల్ మెరిట్ సర్వేలో దేశంలో ర్యాంకింగ్ సాధన
  • హర్షం వ్యక్తం చేసిన పాఠశాల డైరెక్టర్ సురభి శరత్‌కుమార్–సౌమ్య దంపతులు

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం విద్యా భారతి ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక అవార్డును దక్కించుకుంది. ఎడ్యుకేషన్ టుడే నిర్వహించిన ఇండియా స్కూల్ మెరిట్ సర్వేలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పాఠశాలగా గుర్తింపు పొందింది.

ఈ అవార్డును శుక్రవారం బెంగళూరులోని తాజ్ యశ్వంత్‌పూర్‌లో జరిగిన కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు సురభి శరత్‌కుమార్–సౌమ్య దంపతులు స్వీకరించారు. స్టేట్ బోర్డు పారామీటర్ ర్యాంకింగ్‌లో విద్యా భారతి పాఠశాల నెంబర్ వన్ స్థానంలో నిలవడంతో ఈ అవార్డుకు ఎంపికైనట్లు వారు తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లో విద్యలో మోడల్‌గా నిలిచాం…

25 ఏళ్ల ప్రయాణంలో అనేక మైలురాళ్లు దాటుతూ, గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన విద్యను అందించడంలో తమ సంస్థ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించిందని వ్యవస్థాపకులు సురభి ఆగమారావు తెలిపారు. విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల అంకితభావం, తల్లిదండ్రుల ఆదరణతో ఈ గౌరవం సాధ్యమైందని డైరెక్టర్ శరత్‌కుమార్ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆంగ్ల విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు యాజమాన్యం కృషి చేస్తుందని తెలిపారు.

Leave a Reply