Rs. 5 lakh | అయ్యప్ప స్వామి ఆలయానికి ఐదు లక్షల విరాళం..
Rs. 5 lakh | నిజాంపేట, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి ఈ రోజు మేడ్చల్ పట్టణానికి చెందిన గడ్డం లక్ష్మి శ్రీరామ్ గౌడ్ (Gaddam Lakshmi Sriram Goud)దంపతులు ఆలయ నిర్మాణం కోసం రూ. 5 లక్షల(Rs. 5 lakh) విరాళాలని ప్రకటించారు.
ఈ సందర్భంగా గురుస్వామి రంజిత్ గౌడ్ మాట్లాడుతూ.. నిజాంపేటలో అయ్యప్ప సేవాసమితి ఆధ్వర్యంలో దాతల సహకారంతో అయ్యప్ప ఆలయ నిర్మాణం కోసం స్థలం కేటాయించామని ఆ హరిహర పుత్రుని ఆలయం నిర్మాణం కోసం ఎవరైనా దాతలు ముందుకు వచ్చినట్లయితే ఆలయ నిర్మాణం(temple construction)లో తమ వంతు కృషి చేసిన వారు అవుతారని అలాగే ఆలయ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ వారి పూర్తి సహాయ సహకారాలు అందించాలన్నారు.
ఆలయ నిర్మాణానికి 5 లక్షల విరాళాన్ని ప్రకటించడం అయ్యప్ప స్వాములకు అన్నదాన భిక్ష ఏర్పాటు చేసిన గడ్డం లక్ష్మీ శ్రీరామ్ గౌడ్ కుటుంబ సభ్యులకు అయ్యప్ప ఆశీస్సులు అనుగ్రహం ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో గురు స్వాములు యాద గౌడ్, బాలకృష్ణ, నవీన్ రెడ్డి, నాయిని వెంకటేశం, రామచంద్రం, బాల్రెడ్డి, నవీన్ గౌడ్, ప్రణయ్ గౌడ్, శ్రీకాంత్, ధనంజయ, శ్రీకర్, గేమ్ సింగ్, కృష్ణ , సతీష్, సాయి, తదితరులు పాల్గొన్నారు.

