media conference | సీసీఐ ప్రైవేటీకరణ అడ్డుకుంటాం..!

media conference | సీసీఐ ప్రైవేటీకరణ అడ్డుకుంటాం..!

media conference | ఉమ్మడి ఆదిలాబాద్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని ప్రైవేట్ కంపెనీల ద్వారా తెరిపిస్తామని ముఖ్యమంత్రి అదిలాబాద్ బహిరంగ సభలో ప్రకటించడాన్ని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగు రామన్న తీవ్రంగా ఆక్షేపించారు. బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, సీఎం రేవంత్ రెడ్డి లోపాయికారి ఒప్పందంలో భాగంగానే ప్రభుత్వ రంగ సంస్థ సీసీఐని తాకట్టు పెడుతున్నారని ధ్వజమెత్తారు.

ఈరోజు మీడియా సమావేశంలో జోగు రామన్న మాట్లాడుతూ.. ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ(Cement factory) పై నిన్న సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేలా ఉందని విమర్శించారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం కానివ్వమని, ప్రజా ఉద్యమాలతో అడ్డుకుంటామన్నారు. ఈ ఫ్యాక్టరీ భూ నిర్వాసితులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చేపడుతుందనీ పేర్కొన్నారు.


స్వలాభం కోసం స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి సీసీఐ పరిశ్రమను ప్రైవేట్ పరం చేసే దిశగా కుట్రలు పండుతున్నారని ఆరోపించారు. ప్రజాపాలన విజయోత్సవ సభలు అంటూ కాంగ్రెస్ పార్టీ మోసపూరిత సభలను ఏర్పాటు చేస్తా ఉంటే స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ఎంపీ సభల్లో పాలుపంచుకొని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని పొగడ్తలతో ముంచెత్తడం విడ్డూరంగా ఉందన్నారు.

సీసీఐ పరిశ్రమ పున: ప్రారంభం దిశగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అడుగులు పడ్డాయని రామన్న అన్నారు. కేంద్ర మంత్రులను కేటీఆర్‌తో కలిసి భూ నిర్వాసితులతో పాటు సీసీఐ సాధన సమితి కమిటీతో ఢిల్లీకి వెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పటి తమ ప్రభుత్వం సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరణకు చర్యలు తీసుకున్నారని తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డి పట్టణ బాటలో గాలి మాటలు మాట్లాడుతున్నారే తప్ప స్పష్టత లేదన్నారు. ఇంద్రవెల్లి లో యూనివర్సిటీకి బీఆర్ఎస్ పార్టీ తరఫున పూర్తి మద్దతిస్తున్నామన్నారు. రైతుల సమస్యలను పక్కనపెట్టి ప్రజలను నయవంచన చేసేందుకే ముఖ్యమంత్రి పట్టణ బాట పేరుతో హంగామా చేస్తున్నారని విమర్శించారు.

ఈ మీడియా సమావేశం(media conference)లో పట్టణ అధ్యక్షులు అజయ్, పార్టీ నాయకులు మెట్టు ప్రహ్లాద్, సాజితోద్దీన్, గండ్రత్ రమేష్, సేవ్వా జగదీష్,దాసరి రమేష్, పండ్ల శ్రీనివాస్, జంగిలి ప్రశాంత్,నవాతే శ్రీనివాస్, రఘు, వేణు,దయానంద్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply