WARD | ఈర్ప సుకన్య సునీల్ దొర ముమ్మర ప్రచారం
WARD | తాడ్వాయి, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ బలపరిచిన తాడ్వాయి సర్పంచ్ అభ్యర్థిగా ఈర్ప సుకన్య సునీల్ దొర ఎన్నికల (Election) ప్రచారాన్ని ముమ్మరం చేశారు. శుక్రవారం గ్రామంలోని తన వార్డ్ అభ్యర్థులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సుకన్య సునీల్ దొర మాట్లాడుతూ… చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయన్నారు.తనను కాంగ్రెస్ పార్టీ తరుపున అభ్యర్దిగా ప్రకటించినందుకు మంత్రి సీతక్క కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు.
తనను గెలిపిస్తే మంత్రి (Minister) సీతక్క సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పధంలో ముందుకు తీసుకెళ్తానన్నారు. ఈ కార్యక్రమంలో రేగా కళ్యాణి, మండల అధ్యక్షులు బొల్లు దేవేందర్ ముదిరాజ్, మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ అరేం లచ్చు పటేల్, మాజీ సర్పంచ్ ఈర్ప సునీల్ దొర, పాక సాంబయ్య, తదితరులు పాల్గొన్నారు.

